కళాకారులు నిరాశపడొద్దు..కాకతీయ ఉత్సవాలను కొనసాగిస్తాం

కళాకారులు నిరాశపడొద్దు..కాకతీయ ఉత్సవాలను కొనసాగిస్తాం

భారీ వర్షాల కారణంగా కాకతీయ వైభవ సప్తాహం తాత్కాలికంగా వాయిదా పడిందని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ తెలిపారు. ఉత్సవాలను రద్దు చేయలేదని..కేవలం వాయిదా మాత్రమే వేశామని చెప్పారు. వర్షాల నేపథ్యంలో ప్రజా ప్రతినిధులు ప్రజల మధ్య ఉండి సాయం చేయాలని కేటీఆర్ ఆదేశించారని.. అందుకనుగుణంగా పనిచేస్తున్నామన్నారు. కళాకారులు నిరాశపడవద్దని..కాకతీయ సప్తాహం మళ్ళీ కొనసాగిస్తామని తెలిపారు. కాజీపేట రైల్వే జంక్షన్ నుండి ఆపరేట్ అవుతున్న రైళ్ల క్రూ లింక్ లను విజయవాడకు తరలించొద్దన్నారు. రాష్ట్ర విభజన హామీలను కేంద్రం నెరవేర్చ లేదని.. వాటి సాధనకు ఉద్యమిస్తామని వినయ్ భాస్కర్ తెలిపారు. సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఆయన ముర్ఖత్వానికి నిదర్శనమని విమర్శించారు.