స్పౌజ్ బదిలీల్లో ప్రయారిటీ ఇవ్వలే.. ఆందోళనలో టీచర్లు 

స్పౌజ్ బదిలీల్లో ప్రయారిటీ ఇవ్వలే.. ఆందోళనలో టీచర్లు 
  • సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్​కు సర్కార్ షాక్
  •  స్పౌజ్ బదిలీల్లో ప్రయారిటీ ఇవ్వలే.. ఆందోళనలో టీచర్లు 

హైదరాబాద్, వెలుగు: కొత్త జిల్లాలు, జోన్ల అలాట్​మెంట్లలో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం షాకిచ్చింది. స్పౌజ్ బదిలీల్లో ప్రయారిటీ ఇస్తామని చెప్పి అప్లికేషన్లు తీసుకుంది. కానీ, ప్రయారిటీ లిస్టులో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులనే చూపిస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. జీవో 317 ప్రకారం రాష్ట్రంలో టీచర్ల జిల్లాల అలాట్​మెంట్​​ప్రాసెస్ పూర్తయింది. ఇప్పుడు స్పౌజ్ ప్రపోజల్స్‌‌‌‌‌‌‌‌తో పాటు ఇతర అప్పీల్స్‌‌‌‌‌‌‌‌పై స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు దృష్టి పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, సెంట్రల్ గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌, ఔట్‌‌‌‌‌‌‌‌సోర్సింగ్, కాంట్రాక్టు సహా వివిధ విభాగాల్లో పనిచేసే 6 వేల మంది స్పౌజ్ బదిలీలకు అప్లై చేసుకున్నారని, మెడికల్ గ్రౌండ్స్, ఇతర కేటగిరీల్లో ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్ల కోసం మరో 8 వేల మంది నుంచి అప్పీల్స్ వచ్చాయని అధికారులు చెబుతున్నారు. గతంల స్పౌజ్ కేటగిరీలో ఉద్యోగం చేస్తున్న భార్యాభర్తల్లో ఎవరో ఒకరు స్టేట్ ప్రభుత్వ ఉద్యోగి అయితే సరిపోయేది, కానీ ప్రస్తుత అలాట్​మెంట్​​ప్రాసెస్‌‌‌‌‌‌‌‌లో స్టేట్ గవర్నమెంట్, లోకల్ బాడీస్, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వాళ్లకే అవకాశమిస్తారని తెలుస్తోంది. ఈ లెక్కన 2 వేలకు పైగా అప్లికేషన్లను పక్కన పెట్టినట్టు ఆఫీసర్లు చెప్తున్నారు. తమకూ చాన్సివ్వాలని సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగుల ఫ్యామిలీస్ కోరుతున్నాయి. ఒకట్రెండు రోజుల్లో స్పౌజ్, అప్పీల్స్​ కేటగిరిల్లోని టీచర్లకు స్కూల్స్ కేటాయించే అవకాశముందని చెప్తున్నారు.