18 ఏళ్లు నిండిన‌వారికి ప్రైవేట్ హాస్పిట‌ల్స్ లో టీకాలు

18 ఏళ్లు నిండిన‌వారికి ప్రైవేట్ హాస్పిట‌ల్స్ లో టీకాలు

హైద‌రాబాద్ :  తెలంగాణ‌ రాష్ర్టంలో రెండో డోసు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ మంగ‌ళ‌వారం ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. అలాగే 18 సంవ‌త్స‌రాలు నిండిన వారికి క‌రోనా టీకాలు వేసేందుకు అన్ని ప్రైవేటు హాస్పిట‌ల్స్ కు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం ప‌ర్మీష‌న్ ఇస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో తెలంగాణ‌లో ప్రైవేటు కొవిడ్ వ్యాక్సినేష‌న్ సెంట‌ర్లుగా గుర్తింపు పొందిన ప్రైవేట్ హాస్పిట‌ల్స్ అర్హ‌త ఉన్న‌వారికి వ్యాక్సిన్లు ఇవ్వొచ్చని తెలిపింది. వ్యాక్సినేషన్ కోసం ప్రైవేట్ హాస్పిట‌ల్స్ ల‌తో అనుసంధానం కావాలని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ జీ శ్రీనివాసరావు సూచించారు. 18 ఏండ్లు నిండిన వారు టీకా కోసం కొవిడ్ పోర్టల్ లో తమ పేరు నమోదు చేసుకోవాలని తెలిపారు.