ఆర్టీసీ సిబ్బందికి భద్రత కల్పించాలి: ప్రొఫెసర్ నాగేశ్వరరావు

ఆర్టీసీ సిబ్బందికి భద్రత కల్పించాలి: ప్రొఫెసర్ నాగేశ్వరరావు

ముషీరాబాద్,వెలుగు: టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు సంపూర్ణ ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రొఫెసర్ నాగేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అందుకు అవసరమైన మేరకు చట్టాలను సవరించాలని పేర్కొన్నారు. ఆదివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీసీ అభివృద్ధి, ప్రజల ప్రయోజనాలు, కార్మిక సంక్షేమంపై జరిగిన రాష్ట్ర సదస్సులో నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఆర్టీసీలో సిబ్బందిని కుదించే చర్యలు మానుకుని అన్ని ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

 రెండు పే స్కేల్స్, ఏరియర్స్ చెల్లించి ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని గుర్తుచేశారు. మహాలక్ష్మి స్కీమ్ తో ఆర్టీసీలో కోల్పోయే ఆదాయం చెల్లించేందుకు రాష్ట్ర బడ్జెట్ లో  కేటాయింపులు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ జనరల్ సెక్రటరీ లక్ష్మయ్య, పాలడుగు భాస్కర్, ఫెడరేషన్ అధ్యక్షుడు వీరాంజనేయులు, ప్రధాన కార్యదర్శి వీఎస్ రావు  పాల్గొన్నారు.