US వెళ్లేందుకు సుజనాకు TS హైకోర్టు అనుమతి

US వెళ్లేందుకు సుజనాకు TS హైకోర్టు అనుమతి

బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి తెలంగాణ హైకోర్టు ఊరట కలిగించింది. ఆయన అమెరికా వెళ్లేందుకు కోర్టు అనుమతి మంజూరు చేసింది. తనపై గతంలో సీబీఐ లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో.. సుజనా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన దరఖాస్తును పరిశీలించిన ధర్మాసనం ఈ నెల 12 నుంచి ఆగస్టు 11 వరకు అమెరికాలో పర్యటించేందుకు అనుమతించింది. అయితే.. అమెరికా పర్యటనకు వెళ్లేముందు, వచ్చిన తర్వాత సీబీఐకి అన్ని వివరాలు అందించాలని సుజనాను ఆదేశించింది హైకోర్టు.