మానసిక దివ్యాంగుల వివరాలివ్వండి

మానసిక దివ్యాంగుల వివరాలివ్వండి

హైదరాబాద్, వెలుగు : మానసిక దివ్యాంగులు, అనాథలైన మానసిక దివ్యాంగుల వివరాలు ఇవ్వాలని ప్రభు త్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జిల్లా కేంద్రాల్లో వారికి కల్పిస్తున్న వసతుల వివరాలు తెలపాలని సూచించింది. 

మాన సిక ఆరోగ్య సంరక్షణ చట్టం-2017ను అమలు చేయడం లేదంటూ సంగారెడ్డి జిల్లా లోని ఇంటిగ్రేటెడ్‌‌ లైఫ్‌‌ సొసైటీ ఫర్‌‌ ఎడ్యుకే షన్‌‌ అండ్‌‌ డెవలప్మెంట్‌‌ అనే ఎన్‌‌జీవో దాఖ లు చేసిన పిల్‌‌ను చీఫ్‌‌ జస్టిస్‌‌ అలోక్‌‌ అరాధే, జస్టిస్‌‌ శ్రవణ్‌‌ కుమార్‌‌ బెంచ్​శుక్రవారం విచారించింది. 

31,844 మం దికి మానసిక వైకల్యం ఉన్నట్టు గుర్తించా మని, 29,994 మందికి వైద్యం చేయించి వాళ్ల ఇండ్లకు పం పించామని  తెలిపింది. 27 మంది వేర్వేరు కారణాలతో చనిపో యారని ప్రభుత్వం చెప్పింది. కౌంటర్ ​దాఖ లు చేయాలని గవర్నమెంట్‌‌ ను.. తగిన సూ చనలతో రావాలని పిటిషనర్‌‌ కోర్టు ఆదేశించింది.