డీఎంఈ పోస్టును శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయండి

డీఎంఈ పోస్టును శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయండి

హైదరాబాద్, వెలుగు:  డైరెక్టర్‌‌ ఆఫ్‌‌ మెడికల్‌‌ ఎడ్యుకేషన్‌‌(డీఎంఈ) పోస్టును శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. డీఎంఈ పోస్టు అంశంలో వనపర్తి ఆస్పత్రి సూపరింటెండెంట్ నాగేంద్రకుమార్‌‌ ఇటీవల హైకోర్టులో పిటిషన్‌‌ వేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌ అలోక్‌‌ అరాధే, జస్టిస్‌‌ అనిల్‌‌కుమార్‌‌ జూకంటి డివిజన్ బెంచ్ బుధవారం విచారించింది. పిటిషనర్‌‌ తరఫు న్యాయవాది వాదనలు విన్న బెంచ్.. శశికళ పదవీ విరమణపై నిర్ణయం తీసుకోవడంతోపాటు డీఎంఈ పోస్టును  శాశ్వత ప్రాతిపదికన నియమించాలని ఆదేశించింది.