ఆగస్టు 9 నుంచి తెలంగాణ హైకోర్టు ప్రత్యక్ష విచారణ 

V6 Velugu Posted on Jul 31, 2021

కోర్టులో ప్రత్యక్ష విచారణకు తెలంగాణ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. ఆగస్టు 9 నుంచి పాక్షికంగా ప్రత్యక్ష విచారణ ప్రారంభించాలని హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 9 నుంచి సెప్టెంబరు 9 వరకు ప్రత్యక్ష విచారణ జరుగనుంది. రోజూ ఒక ధర్మాసనం, ఒక సింగిల్ బెంచ్ ప్రత్యక్ష విచారణ జరుపుతాయని హైకోర్టు తెలిపింది. వ్యాక్సిన్ వేసుకున్న లాయర్లకే ప్రత్యక్ష విచారణకు అనుమతి ఉంటుందని చెప్పింది. కేసు ఉన్న లాయర్లు మాత్రమే విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టులో ఆగస్టు 8 వరకు ఆన్‌లైన్‌లోనే విచారణ కొనసాగనుంది.

Tagged ts high court, direct hearing, August 9

Latest Videos

Subscribe Now

More News