
టీఎస్ ఐసెట్-2020 షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 9 నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తుల సమర్పణకు తుది గడువు మార్చి 30. రూ. 500 ఫైన్‌తో మే 14 వరకు, రూ. 5 వేల ఫైన్‌తో మే 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 20, 21 తేదీల్లో ఐసెట్-2020 పరీక్ష నిర్వహించనున్నారు అధికారులు. మే 14 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 27న ప్రాథమిక కీ విడుదల చేయనున్నారు. ఈ సారి ఐసెట్ పరీక్షకు నిమిషం నిబంధన అమలు చేయనున్నారు.