
TS ICET కౌన్సెలింగ్ 2024 షెడ్యూల్ విడుదల చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ సీట్ల భర్తీకి సంబంధించి సెప్టెంబరు 1వ తేదీ నుంచి ఐసెట్ కౌన్సెలింగ్ (ICET Counselling 2024) నిర్వహించనున్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో శనివారం ఐసెట్ ప్రవేశాల కమిటీ సమావేశం నిర్వహించారు.
రెండు విడతల కౌన్సెలింగ్ షెడ్యూళ్లను ఖరారు చేశారు. ఈ షెడ్యూల్ ప్రకారం.. సెప్టెంబరు 1 నుంచి 17వ తేదీ వరకు తొలి విడత, 20 నుంచి 28వ తేదీ వరకు చివరి విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఈ నెల 27వ తేదీన పూర్తిస్థాయి అడ్మిషన్ నోటిఫికేషన్, మార్గదర్శకాలను వెబ్‌సైట్ icet.tsche.ac.in లో అందుబాటులో ఉంచనున్నారు.