మే-16 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

మే-16 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

హైదరాబాద్‌: మే 16 నుంచి మే 27 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది ఇంటర్ బోర్డు. ఈ మేరకు బోర్డు కార్యదర్శి అశోక్‌ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. సెకండ్ ఇయర్ పరీక్షలు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఇంటర్‌ ఫలితాల్లో నెలకొన్న గందరగోళంపై ఇంటర్‌ బోర్డు వివరణ ఇచ్చింది. మార్కుల లిస్టులో తప్పులు దొర్లడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని సూచించింది. తాము పరీక్షకు హాజరైనా మార్కులు ఇవ్వకుండా ఇంటర్‌ సర్టిఫికెట్ లో ఏఎఫ్‌, ఏపీ అని రావడంపై కొందరు విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైన విషయం తెలిసిందే. ఒకవేళ ఎవరైనా పరీక్ష రాయకుంటే ఆబ్సెంట్‌ (ఏబీ) అని ఉండాలి.. అయితే, మార్కుల లిస్టులో AF, AP అని ఉండడంతో వాటి అర్థం తెలియక విద్యార్థులు ఆందోళన చెందుతున్న క్రమంలో.. ఆ పొరపాటు చీఫ్‌ సూపరింటెండెంట్‌ల తప్పిదం వల్లే మూడు మెమోల్లో తప్పులు దొర్లాయని తెలిపారు అశోక్‌.