ప్రైవేట్ కాలేజీలకు ఇంటర్ బోర్డు హెచ్చరిక

ప్రైవేట్ కాలేజీలకు ఇంటర్ బోర్డు హెచ్చరిక

హైదరాబాద్: కరోనా టైంలో ఎంతో మంది టీచర్లు, లెక్చరర్ల జీవితాలు ఆగమైన విషయం తెలిసిందే. తాజాగా స్టడీ ఇయర్ ప్రారంభం కావడంతో ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి అన్ని కాలేజీలు. అయితే ఇప్పటికీ కొన్ని ప్రైవేటు కాలీజీలల్లో లెక్చరర్లకు జీతాలు సరిగ్గా ఇవ్వడంలేదనే ఆరోపణలు వస్తున్న క్రమంలో తెలంగాణ ఇంటర్ బోర్డ్ స్పందించింది.

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రవైటు కాలేజీలు తమ సిబ్బందికి జీతాలు ఇవ్వకపోయినా, సిబ్బందిని తొలగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది ఇంటర్ బోర్డు. ఎపిడమిక్ యాక్ట్ ప్రకారం అటువంటి కాలేజీలపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. కాలేజీల్లో రూల్స్ మేరకు సిబ్బంది లేకపోతే.. కాలేజీల గుర్తింపు దరఖాస్తులను తిరస్కరిస్తామని చెప్పింది. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది.