
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు గురువారం మార్నింగ్ సెషన్లో ఫస్టియర్ సెకండ్ లాంగ్వేజీ పేపర్ఎగ్జామ్ జరిగింది. దీనికి 93,152 మంది అటెండ్ కావాల్సి ఉండగా, 87,797 (94.25%) మంది హాజరయ్యారు. వివిధ కారణాలతో 5,355 మంది అటెండ్ కాలేదు.
ఈ పరీక్షలో నలుగురు విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాగా, వారిలో రంగారెడ్డి జిల్లాలో ముగ్గురు, వరంగల్లో ఒకరు ఉన్నారు. మధ్యాహ్నం సెషన్లో సెకండియర్ సెకండ్ లాంగ్వేజీ పరీక్ష నిర్వహించారు. మొత్తం 28,855 మంది హాజరు కావాల్సి ఉండగా, 26,056 మంది అటెండ్ అయ్యారు. మరో 2,799 మంది గైర్హాజరయ్యారు. నిజామాబాద్జిల్లాలో ఒక విద్యార్థిపై మాల్ ప్రాక్టీస్ కేసు నమోదైంది.