టీఎస్​ ఆర్టీసీ గుడ్​ న్యూస్​: శివరాత్రికి వేములవాడకు వెయ్యి స్పెషల్​ బస్సులు

టీఎస్​ ఆర్టీసీ గుడ్​ న్యూస్​: శివరాత్రికి వేములవాడకు వెయ్యి స్పెషల్​ బస్సులు

దేశ వ్యాప్తంగా శివరాత్రి ( మార్చి 8న) ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.  తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు కిటకిటలాడుతాయి.  శైవ క్షేత్రాలు హర హర మహాదేవ శంభో శంకర .... ఓం నమ:శివాయ: అనే నామస్మరతో హోరెత్తిపోతాయి.  శివరాత్రి రోజున శివాలయాలకు భక్తులు పోటెత్తెతారు.  దీనిని దృష్టిలో పెట్టుకొని భక్తుల సౌకర్యార్థం తెలంగాణలోని ప్రసిద్ది చెందిన శైవ క్షేత్రం వేములవాడకు టీఎస్​ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపనుంది. 

తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి ఘనంగా నిర్వహిస్తారు. ఆ పర్వదినాన శైవ క్షేత్రాలు భక్తులతో కిటకి టలాడుతాయి. ఉదయం నుంచి భక్తులు ఆలయాలకు బారులు తీరుతారు. తెలంగాణలోని శైవక్షేత్రాల్లో వేములవాడ రాజన్న ఆలయం ఒకటి. మహా శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి భక్తులు ఈ ఆల యానికి పొటెత్తుతారు. ఈనెల 8న మహా శివరాత్రి సందర్భంగా.. భక్తులకు టీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. వేములవాడ రాజన్న ఆలయంలో జరిగే మహా శివరాత్రి జాతరకు వెయ్యి ప్రత్యేక బస్సులను ఏర్పాట్లు చేస్తున్నట్లు టీఎస్​ ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.

జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 7న.. 265 బస్సులు, 8న 400, 9న 329 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు.  ఈ స్పెషల్ బస్సులు వరంగల్, హన్మకొండ, కరీంనగర్‌‌‌‌‌‌‌‌, నిజామాబాద్‌‌‌‌, సిరిసిల్ల, నర్సంపేట, కోరుట్ల, మెట్ పల్లి,ఆర్మూర్‌‌‌‌‌‌‌‌, కామా రెడ్డి, నిర్మల్, వేములవాడ డిపోల నుంచి నడుస్తాయని చెప్పారు.ఈ మూడు రోజులు వేములవాడ బస్టాండ్ నుంచి ఆలయం వరకు దేవాలయం సౌజ న్యంతో ఉచితంగా 14 మినీ బస్సులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. భక్తులు ఈ సౌకర్యాలను వినియోగించుకోవాలని సూచించారు.