పెరిగిన టీఎస్ఆర్టీసీ డే పాస్ ధరలు..విలీనం మరుసటి రోజే బాదుడు షురూ

పెరిగిన టీఎస్ఆర్టీసీ  డే పాస్ ధరలు..విలీనం మరుసటి రోజే బాదుడు షురూ

హైదరాబాద్ సిటీలో డే పాస్ ధరలు భారీగా పెరిగాయి. 100 రూపాయలున్న డే పాస్ ను టీఎస్ ఆర్టీసీ 120 కు పెంచింది. టీఎస్ ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసిన  మరుసటి రోజే ధరల పెరుగడం గమనార్హం. డే పాస్ ధరలు మళ్లీ పెరిగడంతో  బాదుడు మొదలైంది ప్రయాణికులు మండిపడుతున్నారు. 

గతంలో మహిళలు, సీనియర్ సిటిజన్స్ కు 80 రూపాయలున్న డే పాస్  100 రూపాయలు అయింది. రూ. 80 , రూ. 100 ఉన్నప్పుడు డే పాస్ కు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది. రూ. 120 డే పాస్ ఉన్న సమయంలో రోజుకు 25 వేల పాస్ లు మాత్రమే అమ్మకాలయ్యేవి.  రూ. 80  సమయంలో రోజుకీ 40 వేల వరకు  విక్రయించేవారు కండక్టర్లు.