
హైదరాబాద్,వెలుగు: భద్రాచలంలో ఈనెల 17న జరిగే శ్రీరామనవమి ఉత్సవాల్లో సీతారామచంద్రుల వారి కల్యాణ తలంబ్రాలను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించామని టీఎస్ ఆర్టీసీ మేనేజింగ్డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. ఈ విషయాన్ని ట్విటర్ ఆయన తెలిపారు. సంస్థ లాజిస్టిక్స్విభాగ వెబ్సైట్ ను సందర్శించి రాములోరి కల్యాణ తలంబ్రాలను పొందవచ్చని ఆయన సూచించారు. అలాగే ఆఫ్లైన్లో తలంబ్రాల సేవను పొందాలనుకునే భక్తులు టీఎస్ ఆర్టీసీ కాల్సెంటర్ 040-2345 0033, 040- 6944 0000, 040-6944 0069 నంబర్లను సంప్రదించాలన్నారు.