జూన్ 15వరకు స్కూల్లకు సెలవులు

జూన్ 15వరకు స్కూల్లకు సెలవులు

హైదరాబాద్: రాష్ట్రంలో జూన్ 15 వరకు అన్ని యాజమాన్యాల ఆధీనంలోని పాఠశాలలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. కరోనా మహమ్మారి కట్టడిలో భాగంగా లాక్ డౌన్ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ సందర్భంగా ఇచ్చిన ఉత్తర్వుల్లో విద్యా సంస్థలపై ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్కూల్ తెరిచేందుకు పరిస్థితులు అనుకూలంగా లేవని అన్ని వరగాల నుంచి వచ్చిన వినతుల మేరకు విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలన్నింటికీ జూన్ 15 వరకు సమ్మర్ హాలిడేస్ పెంచుతూ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన ఉత్తర్వులు జారీ చేశారు.