పదో తరగతి పరీక్షల ఫీజు షెడ్యూల్‌ వచ్చేసింది

పదో తరగతి పరీక్షల ఫీజు షెడ్యూల్‌  వచ్చేసింది

తెలంగాణలో ప‌దో త‌ర‌గ‌తి వార్షిక ప‌రీక్షల ఫీజు షెడ్యూల్ రిలీజైంది.  ప్రభుత్వ, ప్రైవేటు పాఠ‌శాల‌ల్లో ప‌ది చ‌దువుతున్న విద్యార్థులు 2023 నవంబర్ 17లోపు  ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబ‌ర్ 1 వ‌ర‌కు రూ. 50 ఫైన్ తో, డిసెంబ‌ర్ 11 వరకు రూ. 200 ఫైన్ తో , డిసెంబ‌ర్ 20వ తేదీ వ‌ర‌కు  రూ. 500 ఫైన్ తో ఫీజు చెల్లించొచ్చు. రెగ్యుల‌ర్ విద్యార్థులు రూ. 125, మూడు సబ్జెక్టులు..   అంత కంటే త‌క్కువ స‌బ్జెక్టులు ఫెయిలైన వారు రూ. 110, మూడు కంటే ఎక్కువ స‌బ్జెక్టులు ఫెయిలైన వారు రూ. 125, వొకేష‌న‌ల్ విద్యార్థులు రూ. 60 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు విద్యాశాఖ  ఉత్తర్వులు జారీ చేసింది.  

ALSO READ :- షారుఖ్ ఖాన్ ఆస్తులు అన్ని కోట్లా..వాచ్ అమ్మితే లైఫ్ సెట్టైపోద్ది