
తెలంగాణ టెట్ నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఏ సెంటర్లో కూడా ఎడిట్ ఆప్షన్ సరిచేయలేదు అధికారులు. అప్లికేషన్స్ లో వ్యక్తిగత వివరాలు తప్పు ఉంటే సరి చేస్తామని చెప్పిన అధికారులు ..తెలంగాణ వ్యాప్తంగా ఏ ఒక్క టెట్ సెంటర్లో కూడా ఆ పనే చేయలేదు. అటు తనిఖీలు కూడా ఎక్కడా సరిగా చేయకపోగా...కనీసం హాల్ టికెట్స్ కూడా చూడలేదని అభ్యర్థులు తెలిపారు.
మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక పేపరుకు బదులు మరో పేపర్ ఇచ్చారు అధికారులు. ప్రభుత్వం, టెట్ అధికారుల నిర్లక్ష్యంతో తీవ్రంగా నష్టపోయామని అభ్యర్థులు తెలిపారు. మరోవైపు పేపర్ వన్ ఈజీగా రాగా. పేపర్ 2 టఫ్ వచ్చిందని అభ్యర్థులు చెప్పారు.
ఇదిలా ఉంటే ఓఎంఆర్ షీట్లో వైటనర్ వాడినా అభ్యర్థులు ఆందోళన చెందవద్దని సిరిసిల్ల జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ తెలిపారు. జవాబు పత్రం ఓఎంఆర్ షీట్లో వైట్నర్ వాడినా
ఇబ్బంది లేదన్నారు. ఈ ఆ విషయంపై సంబంధిత ఉన్నతాధికారులతో చర్చించామని..- ఆ ఓఎంఆర్ షీట్ లను పరిగణలోనికి తీసుకుని మూల్యాంకన చేస్తారన్నారు. - వాటిని మాన్యువల్ చెక్ చేసి... ఆన్లైన్ కూడా పెడతారన్నారు. తద్వారా వైట్నర్ వాడిన అభ్యర్థులు వాటిని చెక్ చేసుకోవచ్చని చెప్పారు.