యూఎన్​ పర్మినెంట్​ ప్రతినిధిగా తిరుమూర్తి

యూఎన్​ పర్మినెంట్​ ప్రతినిధిగా తిరుమూర్తి

న్యూఢిల్లీ: యునైటెడ్​ నేషన్స్‌లో మన పర్మినెంట్​ రిప్రెజెంటేటివ్​గా టీఎస్ ​తిరుమూర్తి నియమితులయ్యారు. తిరుమూర్తి 1985కు చెందిన ఇండియన్​ ఫారెన్​ సర్వీస్​ బ్యాచ్​ అధికారి. ప్రస్తుతం విదేశాంగశాఖలో సెక్రటరీగా ఉన్న ఆయన త్వరలో రిటైర్​ కాబోతున్న సయ్యద్​ అక్బరుద్దీన్​ స్థానంలో నియమితులైనట్టు మినిస్ట్రీ ఆఫ్​ఎక్స్‌టర్నల్​ఎఫైర్స్​(ఎమ్‌ఈఏ) బుధవారం వెల్లడించింది.

యూఎన్​ పర్మినెంట్​ ప్రతినిధిగా అక్బరుద్దీన్ కీలక పాత్ర పోషించారు. జైషే మహమ్మద్​ చీఫ్​ మసూద్​ అజర్ ను యూఎన్​ గ్లోబల్​ టెర్రరిస్టుగా గుర్తించేలా చేయడంలోనూ, ఐక్యరాజ్యసమితిలో కాశ్మీర్​ అంశాన్ని చైనా ప్రస్తావించకుండా అడ్డుకోవడంలోనూ అక్బరుద్దీన్​ తీవ్రంగా కృషిచేశారు.