సీజీజీకి అంత సత్తా ఉందా?

సీజీజీకి అంత  సత్తా ఉందా?

హైదరాబాద్, వెలుగు:

ఇంటర్మీడియట్​ రిజల్ట్స్ ప్రాసెస్​చేసే సామర్థ్యం సెంటర్​ఫర్​గుడ్ గవర్నెన్స్​(సీజీజీ)కు ఉందా అన్నదానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పబ్లిక్​ పరీక్షల ప్రక్రియ నిర్వహించిన అనుభవం లేకపోవడం, సిబ్బంది కొరత, ఇంతకుముందు సీజీజీ చేసిన గ్రూప్–1, దోస్త్​ ప్రక్రియల్లో లోపాలు బయటపడిన నేపథ్యంలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతేడాది ఇంటర్మీడియట్​ ఫలితాల్లో జరిగిన తప్పిదాల నేపథ్యంలో ఈసారి అడ్మిషన్లు మొదలు రిజల్ట్స్​వరకూ ప్రాసెస్​అంతా సీజీజీకి అప్పగించినట్టు ఇంటర్​ బోర్డు తాజాగా ప్రకటించింది. అయితే గతేడాది వివాదానికి కారణమైన గ్లోబరీనా సంస్థను తొలగిస్తున్నట్టు ఎక్కడా అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం.

గత ఏడాది దెబ్బతో..

ఇంటర్‌‌‌‌‌‌‌‌ వార్షిక పరీక్షలు మార్చి 4 నుంచి 23 వరకు జరగనున్నాయి. ఈసారి ఫస్టియర్‌‌‌‌‌‌‌‌లో 4,79,676 మంది, సెకండియర్‌‌‌‌‌‌‌‌లో 4,83,003 మంది పరీక్ష రాయబోతున్నారు. గతేడాది ఫలితాల విషయంలో గందరగోళం నెలకొనడంతో ఫలితాలను డేటా ప్రాసెసింగ్ చేసిన గ్లోబరీనాపై అందరి దృష్టి పడింది. ఆ సంస్థతో ఇంటర్​బోర్డు అధికారికంగా ఒప్పందం చేసుకోకపోవడం, వర్క్ ఆర్డర్ బేస్డ్‌‌‌‌‌‌‌‌గానే రిజల్ట్స్ ప్రాసెస్‌‌‌‌‌‌‌‌ చేయడంపై అప్పట్లో తీవ్ర విమర్శలొచ్చాయి. ఆందోళనలు జరిగాయి. అయినా ప్రభుత్వ పెద్దలు, బోర్డు గ్లోబరీనాను వెనకేసుకొచ్చారు. అయితే తప్పిదాలపై ప్రభుత్వం నియమించిన త్రీమెన్​కమిటీ సిఫారసుల మేరకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్​కు మాత్రం గ్లోబరీనాకు సమాంతరంగా జేఎన్​టీయూ సహకారంతో డేటాటెక్​సంస్థతో ఫలితాల ప్రాసెసింగ్​నిర్వహించారు. అప్పట్లో ఈ అంశంపై ఢిల్లీ స్థాయిలోనూ చర్చ జరిగింది. ఇలాంటి క్రమంలో ఈవిద్యాసంవత్సరం ఈ ప్రక్రియను మళ్లీ గ్లోబరీనాకే సంస్థకే అప్పగిస్తే, ఫలితాల్లో చిన్న తప్పిదం వచ్చినా.. పెద్ద వివాదమయ్యే అవకాశముందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో గ్లోబరీనాను పక్కన పెట్టి, వేరే సంస్థకు అప్పగించాలని నిర్ణయించింది. అయితే గతేడాది ఫలితాల్లో తప్పిదాలకు సంబంధించి ఇప్పటివరకు ఏ ఒక్క అధికారిపైనా చర్యలు తీసుకోలేదు.

సీజీజీకి అప్పగింత…

గవర్నమెంట్​సంస్థగా పేరున్న సీజీజీకి ఈ ఏడాది ఇంటర్​ఫలితాల ప్రాసెస్​నూ అప్పగించారు. అయితే విద్యాసంవత్సరం ప్రారంభంలోనే అడ్మిషన్ల ప్రాసెస్​ను అప్పగించేందుకు అధికారులు ప్రయత్నిస్తే సిబ్బంది కొరత ఉందని దానికి సీజీజీ అంగీకరించలేదు. దీంతో విద్యాశాఖ ముఖ్య అధికారులు రంగంలోకి దిగి ఆ సంస్థ ఉన్నతాధికారులతో మాట్లాడి బలవంతంగా ఒప్పించారనే వాదనలు ఉన్నాయి. ఈక్రమంలో ఫలితాల ప్రక్రియ మొత్తాన్ని సీజీజీకి అప్పగించేందుకు కొద్దిరోజులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయి. రిజల్ట్స్ ​ప్రాసెస్​కూడా సీజీజీనే చేస్తుందని అధికారికంగా ఇంటర్​బోర్డు కార్యదర్శి ఉమర్​ జలీల్​రెండు రోజుల క్రితం ప్రకటించారు.
ఇంతవరకూ బాగానే ఉంది. కానీ ఆసంస్థకు పరీక్షల ప్రాసెస్​చేసే సత్తా ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోపక్క రెండేండ్ల క్రితం గ్రూప్​1 ఫలితాల్లో గందరగోళం ఏర్పడితే, సీజీజీ తప్పిదంతోనే అని టీఎస్పీఎస్సీ ప్రకటించి, రెండోసారి రిజల్ట్స్​ను విడుదల చేసింది. డిగ్రీ ఆన్​లైన్ అడ్మిషన్ల(దోస్త్​) విషయంలోనూ గందరగోళం నెలకొనడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దోస్త్​సీట్ల అలాంట్​మెంట్​ కూడా రెండోసారి చేయాల్సి వచ్చింది.