హైదరాబాద్, వెలుగు: టీజీఎస్‌ఆర్టీసీ (తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్)లో ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ (టీఎస్‌టీ), మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ (ఎంఎస్‌టీ) పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ గడువు ఈనెల 20 సాయంత్రం 5 గంటల వరకు ఉన్నట్టు టీజీఎల్పీఆర్బీ (తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు) చైర్మన్ వీవీ శ్రీనివాస్‌రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
టీఎస్‌టీ పోస్టులు 84, ఎంఎస్‌టీ పోస్టులు 114 భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు www.tgprb.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో చూడాలని పేర్కొన్నారు.
