హైదరాబాద్, వెలుగు: టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో అరెస్టులు కొన సాగుతున్నాయి. ఇరిగేషన్ మాజీ ఏఈ పూల రమేశ్ వద్ద ఏఈ పేపర్ కొనుగోలు చేసిన మరో 19మందిని సోమవారం సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. వీరితో అరెస్టుల సంఖ్య 76కు చేరింది. ఏఈ పేపర్స్ ను 30 మందికి పైగా సేల్ చేశాడు.
ఒక్కో అభ్యర్థి వద్ద రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేశాడు. రమేశ్ నెట్ వర్క్ ను సిట్ ట్రేస్ చేస్తున్నది. ఇందులో మధ్యవర్తులు, అభ్యర్థులను అరెస్ట్ చేస్తున్నది. వివిధ జిల్లాలకు చెందిన డి.శివకుమార్, పి.సురేందర్, హరికృష్ణ, ధరావత్ రాజేశ్, జెన్నాయి అశోక్, ధరావత్ కల్యాణ్, బానోతు నాగరాజు, తోట విజయ్ కుమార్, గడ్డం అజయ్ కుమార్, గుగులోతు సునీల్, కోడి సంతోష్, మర్కి రాములుతో పాటు మరో ఏడుగురిని సిట్ అరెస్ట్ చేసింది.
