కొత్త జిల్లాలవారిగా స్థానికత.. ఓటీఆర్లో ఎడిట్ ఆప్షన్..

కొత్త జిల్లాలవారిగా స్థానికత.. ఓటీఆర్లో ఎడిట్ ఆప్షన్..

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు వన్ టైం రిజిస్ట్రేషన్ వివరాలను అప్ డేట్ చేసుకునే అవకాశం కల్పించింది. ఇందుకోసం ఓటీఆర్ ఎడిట్ ఆప్షన్ను అందుబాటులోకి తెచ్చింది. అభ్యర్థులు www.tspsc.gov.in వెబ్సైట్లో లాగిన్ అయి స్థానికతను ఎడిట్ చేసుకునే వెసలుబాటు కల్పించింది.  

గతంలో రాష్ట్రంలో 10 జిల్లాలు, రెండు జోన్లు, ఒక మల్టీ జోన్ ఉండేవి. 2018 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలో 33 జిల్లాలు, 7 జోన్లు, రెండు మల్టీ జోన్లు ఏర్పాటు చేశారు. ఫలితంగా చాలా మంది అభ్యర్థుల స్థానికతలో మార్పు వచ్చింది. ఈ నేపథ్యంలో వన్ టైం రిజిస్ట్రేషన్ ఎడిట్ఆప్షన్ ను ఉపయోగించుకుని అభ్యర్థులు కొత్తగా ఏర్పాటైన 33 జిల్లాల ప్రకారం 1 నుంచి 7వ తరగతి వరకు ఏ జిల్లాలో చదివారన్నది అప్ డేట్ చేసుకోవాలని టీఎస్పీఎస్పీ సూచించింది. ఇప్పటి వరకు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోని వారు తమ వివరాలను ఓటీఆర్ ఫామ్లో పొందుపరచి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చని  చెప్పింది.