తెలంగాణలో గ్రూప్ 1 యథాతథం

తెలంగాణలో గ్రూప్ 1 యథాతథం

తెలంగాణలో గ్రూప్ 1 యథాతథం
షెడ్యూల్ ప్రకారం ఈ నెల 11న నిర్వహించండి
రద్దు కోసం దాఖలైన పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు
ప్రభుత్వ వాదనలకు సమర్థించిన న్యాయస్థానం
కమిషన్ సిబ్బందిని రీ షఫ్లింగ్ చేశామన్న ఏజీ
వచ్చే 6 నెలల్లో 26 పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడి
ప్రభుత్వ తరఫున వాదనలు వినిపించిన ఏజీ
నిర్వహణను థర్డ్ పార్టీ లేదా యూపీఎస్సీకి ఇవ్వండి
పారదర్శకత లేకుంటే అభ్యర్థులు నష్టపోతారు
కోర్టుకు వివరించిన పిటిషనర్ల తరఫు న్యాయవాది

హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ గ్రూప్ –1 ఈ నెల 11న యథాతథంగా సాగనుంది. ప్రిలిమినరీ పరీక్ష రద్దును కోరుతూ దాఖలైన పిటిషన్లను ఇవాళ తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. పకడ్బందీగా పరీక్ష నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, కమిషన్ సిబ్బందిని రీ షఫ్లింగ్ చేశామని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3.8 లక్షల మంది గ్రూప్ 1 కోసం దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. 1.59 లక్షల మంది ఇప్పటికే హాల్ టికెట్లను కూడా డౌన్ లోడ్ చేసుకున్నారని ఏజీ.. కోర్టుకు విన్నవించారు. 995 సెంటర్లలో పరీక్షలు నిర్వహించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

పరీక్షకు వారం రోజుల ముందు ఇలాంటి పిటిషన్లు దాఖలు చేయడం సరికాదన్నారు. ఈ వాదనలు నమోదు చేసుకున్న న్యాయస్థానం పేపర్ లీక్ లో అరెస్టయిన వారు ఇంకా సర్వీస్ కమిషన్ లో కొనసాగుతున్నారా..? అన ప్రశ్నించింది. దీనిపై స్పందించిన ఏజీ పేపర్ లీకేజీ వ్యవహారం బయటికి రాగానే ప్రభుత్వం పరీక్షను రద్దు చేసిందనిచెప్పారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని, కేసు విచారణ కొనసాగుతున్నదని, ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు 50 మందిపై కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... ఏ కమిషన్ పాలకమండలి ఆధ్వర్యలో పేపర్ లీకైందో.. ఇప్పుడు అదే కమిషన్ పరీక్ష నిర్వహిస్తున్నదన్నారు.

11 ఏండ్ల తర్వాత జరుగుతున్న పరీక్ష ఇదని, థర్డ్ పార్టీ లేదా, యూపీఎస్సీ ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. పారదర్శకత లేకుంటే అభ్యర్థులు నష్టపోతారని చెప్పారు. పేపర్ లీకైన మిగతా పరీక్షలను నిర్వహించకుండా కేవలం గ్రూప్ 1 మాత్రమే నిర్వహిస్తున్నారని తెలిపారు. విచారణ పూర్తి కాకుండా గ్రూప్–1 నిర్వహించవద్దని ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు. దీనిపై స్పందించి హైకోర్టు .. నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారని, దర్యాప్తు అంశాలను కోర్టులు చూసుకుంటాయని పేర్కొంది. ప్రభుత్వ వాదనలు ఏకీభవిస్తూ.. గ్రూప్ 1 రద్దుపై దాఖలైన రెండు పిటిషన్లను కొట్టేసింది.