గ్రూప్ 2 పరీక్ష తేదీ ప్రకటన

గ్రూప్ 2 పరీక్ష తేదీ ప్రకటన

గ్రూప్ 2 పరీక్ష రీ షెడ్యూల్ తేదీని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ పరీక్షలను నవంబర్ 2, 3వ  తేదీల్లో నిర్వహిస్తామని వెల్లడించింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఒక సెషన్..మధ్యాహ్నం 2: 30 గంటల  నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మరో సేషన్లో పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు రాగా.. పరీక్షలను వాయిదా వేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు TSPSC కొత్త తేదీలు ప్రకటించింది. పరీక్షకు వారం ముందు అభ్యర్థులు హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది.

 

టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 పరీక్షను ప్రభుత్వం ఆగస్టు 12వ తేదీన వాయిదా వేసింది.  గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని సీఎం కేసీఆర్ సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో వెల్లడించారు. 

లక్షలాది మంది అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు టీఎస్‌పీఎస్సీతో సంప్రదించి గ్రూప్-2 పరీక్షను రీషెడ్యూల్ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని  సీఎం కేసీఆర్ ఆదేశించారు...అని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 

భవిష్యత్తులో రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌లు సరిగ్గా ఉండేలా చూడాలని చీఫ్ సెక్రటరీకి ముఖ్యమంత్రి కేసీఆర్  సలహా ఇచ్చారు, అలాగే ప్రతి ఔత్సాహికుడికి అర్హత ఉన్న అన్ని పరీక్షలకు సిద్ధం కావడానికి తగిన సమయం లభిస్తుంది..అని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గ్రూప్ పరీక్ష వాయిదా పడింది.