గ్రూప్-2 ద‌ర‌ఖాస్తుల స‌వ‌ర‌ణ‌కు అవ‌కాశం క‌ల్పించిన టీఎస్‌పీఎస్సీ

గ్రూప్-2 ద‌ర‌ఖాస్తుల స‌వ‌ర‌ణ‌కు అవ‌కాశం క‌ల్పించిన టీఎస్‌పీఎస్సీ

హైదరాబాద్‌ : తెలంగాణలో గ్రూప్‌-2 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ వివరాలను ఎడిట్‌ చేసుకొనేందుకు TSPSC అవకాశం కల్పించింది. జులై 8 నుంచి 12వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు వెబ్‌సైట్‌లో ఎడిట్‌ ఆప్షన్‌ను అందుబాటులో ఉంచుతున్నట్టు ప్రకటించింది. వివరాలు తప్పుగా ఎంట్రి చేసిన అభ్యర్థులు TSPSC అఫీషియల్ వెబ్ సైట్ లో  తప్పులు సరి చేసుకోవాలని తెలిపింది.  

తెలంగాణలో 783 పోస్టులకు గానూ 5,51,943 మంది దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.  గ్రూప్-2 పరీక్షకు ఒక్కో పోస్టుకు సగటున 705 మంది పోటీ పడనున్నారు. ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్‌ 2 పరీక్ష నిర్వహించనున్నట్టు టీఎస్‌పీఎస్సీ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.