
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్( టీఎస్ పీఎస్సీ)లో ప్రక్షాళ షురూ అయ్యింది. టీఎస్ పీఎస్సీలోని ఐదుగురు సభ్యులు రాజీనామా చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి.. పలు శాఖలపై రివ్యూలు నిర్వహిస్తూ అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నారు.
ఈక్రమంలో టీఎస్ పీఎస్సీ ప్రక్షాళపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా సచివాలయంలో టీఎస్ పీఎస్సీపై సమీక్షించి కీలక నిర్ణయాలు తీసుంటున్నారు సీఎం రేవంత్. దీంతో TSPSCలో ప్రక్షాళన మొదలైనట్లు తెలుస్తోంది. డిసెంబర్ 11వ తేదీ సోమవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అనంతరం TSPSC ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
ఇదే బాటాలో కమిషన్ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. డీసెంబర్ 12వ తేదీ మంగళవారం కమిషన్ ఐదుగురు సభ్యులు బండి లింగారెడ్డి, కోట్ల అరుణ కుమారి, సుమిత్రా ఆనంద్, కారం రవీంద్రరెడ్డి, ఆర్ సత్యనారాయణలు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అనంతరం తమ సభ్యత్వాలకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తమ రాజీనామాల లేఖలను సమర్పించేందుకు గవర్నర్ తమిళిసై అప్పాయింట్ మెంట్ కోరారు. అయితే, ప్రస్తుతం గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో రేపు రాజీనామా లేఖలను అందజేయనున్నట్లు తెలుస్తోంది.