పేపర్ లీకేజీ కేసులో మరో కొత్త విషయం.. బ్లూటూత్లో విని అన్సర్లు రాసిన నిందితులు

పేపర్ లీకేజీ కేసులో మరో కొత్త విషయం.. బ్లూటూత్లో విని అన్సర్లు రాసిన నిందితులు

టీఎస్పీఎస్సీలో మరో సంచలనం వెలుగు చూసింది. పేపర్ లీకేజీ  నిందితులు ఎలక్ట్రానిక్‌ డివైజ్‌తో పరీక్ష రాసినట్లు సిట్ అధికారులు తేల్చారు. ఎలక్ట్రానిక్ డివైజ్ తో ఎగ్జామ్ రాసిన నిందితులు ప్రశాంత్‌, మహేశ్‌, నవీన్‌లను అరెస్ట్‌ చేశారు. ఈ ముగ్గురు కూడా రమేష్‌ ద్వారా AEE పేపర్ పొందినట్లు తెలిపారు. పరీక్ష సమయంలో  నిందితులకు రమేష్‌ ఆన్సర్లు చెప్పారని అధికారులు వెల్లడించారు. రమేష్ సమాధానాలు చెప్తుంటే..నిందితులు బ్లూటూత్‌లో విని రాసినట్టు సిట్‌ అధికారులు గుర్తించారు. కట్టుదిట్టంగా నిర్వహించే పరీక్ష హాల్‌లోకి ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లు ఎలా వెళ్లాయనే దానిపై సిట్ అధికారులు సీరియస్గా దర్యాప్తు చేస్తున్నారు. 

టీఎస్పీఎస్సీలో రమేష్ ఔట్ సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేశాడు. టీఎస్పీఎస్సీ కేసులో ఇప్పటికే  రమేష్‌ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.   టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన AEE పేపర్‌ లీక్‌లో ఇప్పటివరకు 43 మందిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ కేసులో అరెస్ట్ చేసిన వారి సంఖ్య 46కు చేరుకుంది.