TSPSC Paper Leak : బీజేవైఎం నేతలపై కేసు నమోదు

TSPSC Paper Leak : బీజేవైఎం నేతలపై కేసు నమోదు

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ఇటీవల హైదరాబాద్ లోని టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించిన బీజేవైఎం నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ , పలువురు కార్యకర్తలపైనా కేసులు ఫైల్ అయ్యాయి. అంతకుముందు పేపర్ లీక్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం నేతలు, కార్యకర్తలతో కలిసి ఆందోళన చేశారు. ఈ ఘటనలో ఆందోళన చేస్తున్న నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు, నాలుగు పోలీస్ స్టేషన్ లు తిప్పి పోలీసులు ఈ రోజు కేసులు నమోదు చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాష్ , యువ మోర్చా నాయకులపై ఐపీసీ సెక్షన్ 3 & 4 ,143 , 427 ,448 ,353 , తో పాటు 149 సెక్షన్ల కింద కేసు నమోదైంది.

అరెస్టు అనంతరం బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు వైద్య పరీక్షలు నిమిత్తం గాంధీ హాస్పిటల్ తరలించారు. ఈ కేసులో 9 మంది బీజేవైఎం నేతలను అరెస్టు చేసిన పోలీసులు... వైద్య పరీక్షల అనంతరం పోలీసులు చంచల్ గూడ జైలుకు రిమాండ్ కు తరలించారు.