TSPSC  : సీడీపీవో డిపార్ట్మెంట్లో రాజశేఖర్ తల్లి

TSPSC  : సీడీపీవో డిపార్ట్మెంట్లో రాజశేఖర్ తల్లి

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను  విద్యార్థి సంఘాలు ముట్టడించాయి. ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలోని వివిధ సంఘాల విద్యార్థి నేతలు, స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు. మార్చి 20వ తేదీన టీఎస్పీఎస్సీ ఆఫీసును ముట్టడించి నిరసనకు దిగారు. పేపర్ లీకేజీలో కొత్త కోణాలు బయటపెట్టారు స్టూడెంట్స్. 

కేసులో ప్రధాన నిందితుడు అయిన రాజశేఖర్ తల్లి.. చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు డిపార్ట్మెంట్ లో పని చేశారని.. సీడీపీవో ఎగ్జామ్ పేపర్ కూడా లీక్ అయ్యి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ పరీక్ష కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు స్టూడెంట్స్.  గ్రూప్ 1 తర్వాత జరిగిన చైల్డ్ డెవలప్మెంట్  ప్రాజెక్ట్ ఆఫీసర్స్ పరీక్ష ఎందుకు రద్దు చేయలని ప్రశ్నిస్తున్నారు విద్యార్థి సంఘాల నేతలు. 

గ్రూప్ 1 ఎగ్జామ్ పేపర్ నే లీక్ చేసినోళ్లు.. సీడీపీవో పేపర్ ఎందుకు లీక్ చేసి ఉండరని ప్రశ్నిస్తున్నారు. ప్రధాన నిందితుడు రాజశేఖర్ తల్లి.. ఆ డిపార్ట్మెంట్ లోనే పని చేస్తున్నారని.. ఇన్ని అనుమానాలు, కుట్ర కోణాలు ఉన్నా.. ఆ ఎగ్జామ్ రద్దు చేయకపోవటానికి కారణాలు ఏంటని నిలదీస్తున్నారు స్టూడెంట్స్. సీడీపీవో ఎగ్జామ్ విషయంలోనూ విచారణ చేయాలని.. పేపర్ లీక్ అయ్యిందా లేదా అనేది తేల్చాలంటూ టీఎస్ పీఎస్సీ ఆఫీస్ ముట్టడించి ఆందోళన చేశారు స్టూడెంట్స్. నిరసనకారులను బలవంతంగా అక్కడి నుంచి తరలించారు పోలీసులు.