TSPSC : మూడో రోజు నిందితులను ప్రశ్నిస్తోన్న సిట్

TSPSC : మూడో రోజు నిందితులను ప్రశ్నిస్తోన్న సిట్

టీఎస్ పీఎస్ సీ( TSPSC) పేపర్ లీక్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది.   ముగ్గురు నిందితులను సీసీఎస్  నుంచి హిమాయత్ నగర్ సిట్ ఆఫీస్ కి తరలించారు పోలీసులు. నిందితులు  శమీమ్, సురేష్, రమేష్ లను మూడోరోజు విచారిస్తోంది సిట్.  

మార్చి 30న  ముగ్గురు నిందితుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు.  ఎల్బీనగర్, ఉప్పల్, సైదాబాద్ లో నిందితులను తీసుకెళ్లి విచారించారు.  గ్రూప్ 1 కి సంబంధించిన మెటీరియల్ స్వాధీనం చేసుకున్నారు.

మరోవైపు గ్రూప్- 1 ప్రిలిమ్స్ లో 100 మార్కులకు పైగా వచ్చిన అభ్యర్థులను సిట్ కార్యాలయంలో విచారిస్తున్నారు సిట్ అధికారులు.  మరోవైపు ఈ కేసులో అరెస్ట్ అయిన రాజేందర్ కుమార్, ప్రశాంత్, తిరుపతయ్య లు కస్టడీ విచారణకు అనుమతించాలని నాంపల్లి కోర్టులో సిట్ పిటిషన్ వేసింది. ఇవాళ మార్చి 31న   కస్టడీ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో విచారించింది.