
హైదరాబాద్, వెలుగు : పేపర్ లీకేజీల నేపథ్యంలో వాయిదా వేసిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్, వెంటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల పరీక్షల కొత్త తేదీలను టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. జులై 8న టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, జులై 13,14 తేదీల్లో వెంటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఎగ్జామ్లను పెడ్తామని వెల్లడించింది. ఈ పరీక్షలను ఆన్లైన్లోనే నిర్వహించనున్నట్లు చెప్పింది.
మార్చి12న టౌన్ ప్లానింగ్ ఆఫీసర్(175 పోస్టులు) ఎగ్జామ్ జరగాల్సి ఉండగా చివరి నిమిషంలో వాయిదా వేశారు. దీనికి 33,342 మంది అప్లై చేశారు. 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి మార్చి 15,16 తేదీల్లో జరగాల్సిన పరీక్ష కూడా పేపర్ లీకేజీతో వాయిదా పడింది.