
కొండగట్టు ప్రమాదం నుంచి టీఎస్ ఆర్టీసీ ఇంకా గుణపాఠం నేర్చుకోనట్లుంది. పరిమితిని మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్ల జరిగిన ఆ ప్రమాద సంఘటన మరువక ముందే ఈ రోజు మరో బస్సు ఓవర్ లోడ్ కారణంగా సీజ్ చేయబడింది.
కొడిమ్యాల నుంచి కరీంనగర్ వెళుతున్న కోరుట్ల డిపోకి చెందిన పల్లె వెలుగు బస్సును ఈ రోజు రవాణా శాఖ అధికారులు సీజ్ చేశారు. 55 మంది ప్రయాణించాల్సిన బస్సులో 125 మంది ప్రయాణీకులను ఎక్కించుకొని కరీంనగర్ వెళ్తుండగా.. అధికారులు తమకు అందిన సమాచారంతో బస్సును సీజ్ చేశారు. ఆ తర్వాత బస్సును కొడిమ్యాల పోలీస్ స్టేషన్ కు తరలించారు. కొండగట్టు బస్సు ప్రమాదం తర్వాత కూడా ఆర్టీసీ బుద్ధి మారలేదని అధికారులు అంటున్నారు.