TSRTC : మహాశివరాత్రికి ప్రత్యేక బస్సులు

TSRTC : మహాశివరాత్రికి ప్రత్యేక బస్సులు

మహా శివరాత్రి పండగను పురస్కరించుకుని TSRCT ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 40 శైవ క్షేత్రాలకు 2,427 బస్సు సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 17 నుంచి 19 వరకు ఈ ప్రత్యేక సర్వీసులు ప్రజలకు అందుబాటులో ఉంటాయని TSRCT వెల్లడించింది. 

ఏ క్షేత్రానికి ఎన్ని బస్సులు..?

భక్తుల సౌకర్యార్థం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం క్షేత్రానికి 578 బస్సులు.. కరీంనగర్ జిల్లా వేములవాడకు 481, మేడ్చల్ జిల్లా కీసర గుట్టకు 239, మెదక్ జిల్లా ఏడుపాయలకు 497 బస్సులు నడపను న్నారు. మంచిర్యాల జిల్లా వేలాల గట్టు మల్లన్న క్షేత్రానికి 108 బస్సులు, భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరానికి 51 బస్సులు, సిద్దిపేట జిల్లా కొమురవెల్లికి 52, జగిత్యాల జిల్లా కొండగట్టుకు 37, గద్వాల జిల్లా అలంపూర్‌కు 16, ములుగు జిల్లా రామప్పకు 15, నాగర్ కర్నూల్ జిల్లా ఉమా మహేశ్వరాలయానికి 14 ప్రత్యేక బస్సులు నడుస్తాయని TSRCT అధికారులు చెప్పారు.

శ్రీశైలం ఆలయానికి వెళ్లే భక్తులు హైదరాబాద్‌లోని MGBS, JBS, దిల్‌సుఖ్‌నగర్‌, IS సదన్‌, KPHB కాలనీ, BHEL నుంచి పత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. ఈ బస్సులకు రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించినట్లు ప్రకటించారు. మహా శివరాత్రి రద్దీకి అనుగుణంగా మరిన్ని పత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు టీఎస్ ఆర్టీసీ సిద్దమవుతోంది. ప్రజలు బస్సులు అద్దెకు తీసుకుంటే టీఎస్ఆర్టీసీ 10 శాతం రాయితీ ఇస్తుందని, భక్తులు ఈ సౌకర్యాన్ని  ఉపయోగించుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం (99592 26250, 9959226248, 9959226257, 9959226246, 040-27802203, 9959226250, 9959226149) ఫోన్  నెంబర్లు అందుబాటులోకి తీసుకువచ్చారు. టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్ సైట్ www.tsrtconline.in లో మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.