మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాల్ కు ఆర్టీసీ అధికారుల నోటీసులు

మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాల్ కు ఆర్టీసీ అధికారుల నోటీసులు

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి చెందిన జీవన్ మాల్ కు టీఎస్ఆర్టీసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి జీవన్ మాల్ అనే షాపింగ్ మాల్ ఉంది. అయితే, ఆర్టీసీకి సంబంధించిన స్థలంలో జీవన్ రెడ్డి ఈ మాల్ నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆర్టీసీకి జీవన్ మాల్.. ఎనిమిది కోట్ల రూపాయలను బకాయి పడ్డట్లు సమాచారం.

ఇంతవరకు ఆ బాకాయిలు చెల్లించకపోవడంతో డిసెంబర్ 7వ తేదీ గురువారం ఆర్టీసీ అధికారులు జీవన్ మాల్ కు నోటీసులు జారీ చేశారు.  పట్టణంలోని జీవన్ మాల్ కు వెళ్లి.. షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్న వ్యాపారస్తులను ఖాళీ చేయాలని ఆర్టీసీ అధికారులు మైక్ ద్వారా తెలిపారు.