అయ్పాయె.. పందెం కోడి కథ కంచికి

అయ్పాయె.. పందెం కోడి కథ కంచికి

కరీంనగర్ ఆర్టీసీ డిపోలోని పందెం కోడి వ్యవహారం సినిమా ట్విస్టులను తలపిచింది. పశు సంవర్ధక శాఖ జోక్యంతో వేలం ఆగిపోయింది. ముందు పశుసంరక్షక కేంద్రానికి చేరింది. ఆ తర్వాత జంతు ప్రేమికుల జోక్యంతో చివరకు పందెం కోడిని బ్లూ క్రాస్ సంస్థకు అప్పగించారు ఆర్టీసీ అధికారులు. 

జనవరి 9న కరీంనగర్ డిపో2కు చెందిన ఆర్టీసీ బస్సులో పందెం కోడి దొరికింది. దీన్ని కండక్టర్ డిపోలో అప్పగించాడు. కోడి గురించి ఎవరూ రాకపోవడంతో నిబంధనల ప్రకారం వేలం వేయడానికి సిద్ధమయ్యారు ఆర్టీసీ అధికారులు. అయితే కోడి తనదంటూ నెల్లూరు జిల్లాకు చెందిన వల్లపు మహేష్ ఓ వీడియో రిలీజ్ చేశాడు. వేలం ఆపాలని ఆర్టీసీ అధికారులను కోరాడు. అయితే కోడి వేలాన్ని ఆపబోమని ఆర్టీసీ అధికారులు చెప్పారు. లాస్ ఆఫ్ ప్రాపర్టీ కింద మరిచిపోయిన వస్తువుల గురించి సరైన ఆధారాలతో ఎవరూ రాకపోతే 24 గంటల తర్వాత వేలం వేస్తామని తెలిపారు.  అవసరమైతే కోడి బాధితుడు వేలంలో పాల్గొనాలని సూచించారు. దీంతో వివిధ ప్రాంతాలకు దాదాపు 20 మంది వేలంలో పాల్గొనడానికి వచ్చారు. 

మరోవైప పశుసంరక్షణ చట్టం గురించి అధికారులు ఆర్టీసీ ఆఫీసర్లకు గుర్తు చేశారు. దీంతో వేలం రద్దు చేస్తునట్టు ప్రకటించారు. కోడిని పశుసంరక్షణ అధికారులకు అప్పగించారు ఆర్టీసీ అధికారులు. అయితే పందెం కోడిని సంరక్షిస్తామని బ్లూ క్రాస్ సంస్థ ఆర్టీసీ అధికారులకు సమాచారం ఇచ్చింది. దీంతో ఆ సంస్థకు కోడిని అప్పగించారు ఆర్టీసీ అధికారులు.