మాకూ ఆరోగ్య పరీక్షలు చేయించండి: ఆర్టీసీ రిటైర్డ్  ఉద్యోగులు

మాకూ ఆరోగ్య పరీక్షలు చేయించండి: ఆర్టీసీ రిటైర్డ్  ఉద్యోగులు

హైదరాబాద్, వెలుగు : ఆర్టీసీ కార్మికులకు, ఉద్యోగులకు మేనేజ్ మెంట్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న హెల్త్ ప్రొఫెల్ ను తమకూ అమలు చేయాలని  కార్పొరేషన్ లోని రిటైర్డ్ ఉద్యోగులు కోరుతున్నారు. సంస్థలో పనిచేసి రిటైర్డ్ అయిన ఉద్యోగులు సుమారు 20వేల మంది ఉన్నట్లు తెలుస్తోంది.

ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులందరికి బీపీ, కంటి పరీక్ష, ఈసీజీ కొలెస్ట్రాల్, క్రియాటినిస్ సీరం వంటి వివిధ రకాల 17 టెస్ట్ లను ‘ గ్రాండ్ హెల్త్  చాలెంజ్ ’  పేరుతో చేస్తున్నారు. ఈ నెల 3 నుంచి రాష్ర్టవ్యాప్తంగా అన్ని డిపోలు, వర్క్ షాపుల్లో  ఈ కార్యక్రమం  ప్రారంభమైంది. ఈ నెల చివరి వరకు కార్పొరేషన్ లోని కార్మికులు, ఉద్యోగులందరికీ  టెస్ట్ ల ప్రాసెస్  పూర్తి చేయనున్నారు. ఈ హెల్త్ ప్రొఫైల్ ప్రకారం ఆర్టీసీ తార్నాక హాస్పిటల్ డాక్టర్లు పలు సలహాలు , సూచనలు ఇవ్వనున్నారు.

మా ప్రతిపాదనను పరిశీలించాలి: తిరుపతి, టీఎంయూ అధ్యక్షుడు

ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు 4 లక్షల వరకు బయట హాస్పిటల్స్ లో ట్రీట్ మెంట్ ఫ్రీగా ఇస్తున్నారు. హెల్త్ ప్రొఫెల్ చాలెంజ్ లో  భాగంగా రిటైర్డ్ ఉద్యోగులకు కూడా టెస్టులు చేయాలని కోరుతున్నం. సంస్థ మా ప్రతిపాదనను పరిశీలించాలి.