మహిళల కోసం ఆర్టీసీ అదిరిపోయే ఆఫర్

మహిళల కోసం ఆర్టీసీ అదిరిపోయే ఆఫర్

ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు, బాలికలకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ తెలిపారు. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలను 12 కారిడార్​లుగా విభజించి 350 వరకు బస్సులను నడుపనున్నట్లు వెల్లడించారు. ఇబ్రహీంపట్నం క్లస్టర్​ పరిధిలో 44 వేల మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నట్లు పేర్కొన్నారు. 

మహిళలు, విద్యార్థినులు సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉప్పల్‌ టు బోగారం, బోగారం టు సికింద్రాబాద్‌, ఎల్‌బీ నగర్‌ టు ఇబ్రహీంపట్నం, ఇబ్రహీంపట్నం టు ఎల్‌బీనగర్‌ వరకు బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు చెప్పారు. ఎల్బీ నగర్ టు ఇబ్రహీంపట్నం గురునానక్ యూనివర్సిటీ వరకు, గురునానక్ యూనివర్సిటీ నుంచి ఎల్బీ నగర్ వరకు కూడా బస్సు సర్వీసులు నడుస్తాయని తెలిపారు.