IAS అధికారుల రిపోర్ట్ పై హైకోర్ట్ సీరియస్

IAS అధికారుల రిపోర్ట్ పై హైకోర్ట్ సీరియస్

హైదరాబాద్ : హైకోర్ట్ లో ఆర్టీసీ సమ్మె పిటిషన్ పై వాదనలు కొనసాగుతున్నాయి. విచారణలో భాగంగా తెలంగాణ చీఫ్ సెక్రటరీ SK జోషి, GHMC కమిషనర్ లోకేష్ కుమార్, ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ, ఆర్ధిక శాఖ కార్యదర్శి రామకృష్ణ రావు హైకోర్టుకు హాజరయ్యారు. ఆర్టీసీ ఎండీ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఇచ్చిన  రెండు నివేదికలు వేరుగా ఉన్నాయంది  హైకోర్టు. అధికారుల నివేదికలపై స్వయంగా  వివరణ ఇవ్వాలని  సీఎస్ ని ఆదేశించింది. హైకోర్టుకు  IAS  అధికారులు ఇలా నివేదికలు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందని తెలిపింది.

హైకోర్టు ఆదేశాలతో ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణా రావు  స్వయంగా వివరణ ఇస్తున్నారు. రికార్డులు  క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక ఇస్తున్నట్టు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి  పేర్కొన్నారు.  దీంతో మొదటి నివేదిక పరిశీలించాకుండానే ఇచ్చారా అని ప్రవ్నించింది  హైకోర్టు. తక్కువ సమయంలో తమ కార్యాలయంలో ఉన్న రికార్డుల ఆధారంగా… నివేదిక రూపొందించామని.. మన్నించాలని  హైకోర్టును కోరారు రామకృష్ణా రావు. దీనిపై స్పందించిన కోర్టు క్షమాపణ కోరడం… సమాధానం కాదంది. కోర్టులకు వాస్తవాలు చెప్పాలంది.  సీజే అడిగిన ప్రతి ప్రశ్నకి నివేదిక ఆధారంగా లెక్కలు చూపిస్తూ సమాధానం చెబుతున్నారు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు.