దసరా పండుగకు ఆర్టీసి ప్రత్యేక బస్సులు

దసరా పండుగకు ఆర్టీసి ప్రత్యేక బస్సులు

దసరా పండుగ నేపథ్యంలో  టిఎస్​ఆర్టీసీ ప్రత్యేక బస్సులను  నడపనుంది. అక్టోబర్​13వ తేది నుంచి  24వ తేదీ వరకు స్కూల్స్​, కాలేజీలకు ప్రభుత్వం  దసరా సెలవులు ప్రకటించడంతో తమ పిల్లలతో  ప్రజలు హైదరాబాద్​ నగరంతోపాటు పలు పట్టాణాల నుంచి  సొంత ఊర్లకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా   ప్రత్యేక బస్సు సర్వీసులను నడపాలని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టిఎస్​ఆర్టీసి)  నిర్ణయించింది.

Also Read:- పోస్ పోర్టు ఆఫీసుల్లో స్పెషల్ డ్రైవ్

 2023, అక్టోబర్ 13వ తేదీ నుంచి అక్టోబర్​25వ తేదీ వరకు రాష్ట్రంలో ప్రత్యేక బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయని  వెల్లడించింది. దసరా పండుగకు సొంత ఊర్లకు వెళ్లే  ప్రయాణికుల కోసం  రాష్ట్ర వ్యాప్తంగా 5,265 అదనపు సర్వీసులను నడుపనున్నట్లు తెలిపింది.  పండగ సీజన్​ అయినా..  ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని, సాధారణ ఛార్జీలతోనే ప్రత్యేక బస్సుల్లో ప్రయాణం చేయవచ్చని టిఎస్ఆర్టీసీ పేర్కొంది.