22న శ్రీవారి గరుడ సేవ.. 10 లక్షల మంది భక్తుల అంచనా

22న శ్రీవారి గరుడ సేవ.. 10 లక్షల మంది భక్తుల అంచనా

తిరుమల (Tirumala) శ్రీవారి బ్రహ్మోత్సవాల (Srivari Brahmotsavalu) తేదీలు ఖరారయ్యారు. ఈ ఏడాది అధికమాసం కారణంగా రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. సెప్టెంబరు 18 నుంచి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు..  అక్టోబరు 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్టు టీటీడీ ప్రకటించింది. సెప్టెంబర్  22న శ్రీవారి గరుడ సేవ నిర్వహిస్తామని.. ఆరోజున  10 లక్షల మంది భక్తులు వస్తారని టీడీపీ అంచనా వేస్తుంది.   బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సెప్టెంబర్‌ 18 నుంచి అక్టోబర్‌ 2 వరకు, అక్టోబర్‌ 15 నుంచి 23 వరకు, అక్టోబర్‌ 14న నిర్వహించాల్సిన పలు సేవలు రద్దు చేశారు.

తిరుమలలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో ధర్మారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈసారి బ్రహ్మోత్సవాలకు చాలా విశిష్టత ఉందని చెప్పారు. ఈ సారి అధిక మాసం సందర్భంగా వార్షిక, నవరాత్రి బ్రహ్మోత్సవాలు  నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సెప్టెంబర్‌ 18వ తేదీన ధ్వజారోహణం ఉంటుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పిస్తారన్నారు. రెండు సార్లు జరిగే బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. స్వయంగా వచ్చే ప్రముఖులకు మాత్రమే బ్రేక్‌ దర్శనం కల్పిస్తున్నట్లు వివరించారు.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్‌ 22న గరుడ సేవ, 23న స్వర్ణరథ ఉరేగింపు ఉంటాయని.. బ్రహ్మోత్సవాల సమయంలో సిఫార్సు లేఖల స్వీకరణపై వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశామని వెల్లడించారు. వెనుకబడ్డ ప్రాంతాలకు చెందిన 10 వేల మంది భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పిస్తామని పేర్కొన్నారు. గరుడ సేవ రోజున తిరుమల చేరుకున్న భక్తులందరికీ స్వామి వారి దర్శన భాగ్యం కల్పించేలా ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు. 

 అక్టోబరు 15 నుంచి 23వ తేదీ వరకు అష్టదళపాద పద్మారాధన, తిరుప్పావడ, కల్యాణోత్సవం, సహస్రదీపాలంకార, ఊంజల్‌ సేవలను టీటీడీ రద్దు చేసింది. ముందస్తుగా ఆర్జిత బ్రహ్మోత్సవం సేవా టికెట్లు బుక్‌ చేసుకున్నవారికి, నిర్దేశిత వాహన సేవలకు మాత్రమే అనుమతించనున్నట్టు టీటీడీ స్పష్టం చేసింది. నవరాత్రి బ్రహ్మోత్సవాల అంకురార్పణ కారణంగా అక్టోబర్‌ 14న సహస్రదీపాలంకార సేవను రద్దు చేసినట్టు టీటీడీ ప్రకటించింది.

రద్దు చేసే సేవలివి..

బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సెప్టెంబర్‌ 18 నుంచి అక్టోబర్‌ 26 వరకు, అక్టోబర్‌ 15 నుంచి 23 వరకు అష్టాదశ పాదపద్మారాధన, తిరుప్పావడై, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకార సేవలు రద్దు చేయనున్నారు. ముందస్తుగా ఆర్జిత బ్రహ్మోత్సవం సేవా టికెట్లు బుక్‌ చేసుకున్న భక్తులను నిర్దేశిత వాహన సేవకే అనుమతిస్తారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల అంకురార్పణ కారణంగా అక్టోబర్‌ 14న సహస్రదీపాలంకార సేవను రద్దు చేసినట్టు టీటీడీ ప్రకటించింది.