కలియుగ వైకుంఠం తిరుమలలో జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఉద్దేశించి టీటీడీ ఈవో శ్యామలరావు డిప్యుటేషన్ సిబ్బందికి కీలక ఆదేశాలు జారీ చేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు విశేష సేవలు అందించాలని, విధులను నిర్వర్తించడంతో పాటు, డిప్యుటేషన్ సిబ్బంది తమ పరిసరాలపై నిఘా ఉంచాలని ఈవో శ్యామలరావు సూచించారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, సమస్యను పరిష్కరించడంలో ముఖ్యపాత్ర పోషించాలని అన్నారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు పోలీసులు, జిల్లా యంత్రాంగం, డిప్యుటేషన్ సిబ్బంది సమన్వయంతో పని చేయాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. అనంతరం అదనపు ఈఓ శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, సివిఎస్‌వో శ్రీ శ్రీధర్‌లు కూడా గతంలో బ్రహ్మోత్సవాల సమయంలో... ముఖ్యంగా గరుడసేవ రోజున ఉండే సమన్వయ సమస్యలు ఈసారి తలెత్తవని డిప్యుటేషన్ అధికారులకు వివిధ అంశాలపై కూడా తెలియజేశారు.
ALSO READ | అక్టోబర్ 3 నుంచి దసరా నవరాత్రి ఉత్సవాలు.. ఎప్పటివరకంటే...