టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి

టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి

టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకరరెడ్డి టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) ఛైర్మన్ గా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని ముఖ్యమంత్రి జగన్  నియమించారు. దీంతో పాటు  పాలకమండలిలో  కూడా మార్పులు చేసే అవకాశం ఉంది.   ప్రస్తుత టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ బాధ్యతలను జగన్ అప్పగించారు.  ఈ క్రమంలో టీటీడీ బాధ్యతల నుంచి తప్పించి పూర్తి స్థాయిలో పార్టీ కార్యకలాపాలపై సుబ్బారెడ్డి ఫోకస్ చేసేలా జగన్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.  టీడీపీకి కంచుకోటగా ఉండే ఉత్తరాంధ్రలో గత ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. ఆ పట్టు సడలకుండా ఉండేందుకు సీనియర్ రాజకీయవేత్త సుబ్బారెడ్డికి పూర్తి బాధ్యతలను జగన్ అప్పగించనున్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో  భూమన కరుణాకరరెడ్డి టీటీడీ చైర్మన్ గా పనిచేశారు.  మొదట టీటీడీ పాలక మండలిలో సభ్యుడిగా.. ఆ తరువాత చైర్మన్ గా నియమితులయ్యారు. 2006-08 మధ్య కాలంలో ఆయన టీటీడీ చైర్మన్ గా కొనసాగారు. ప్రస్తుతం తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్న భూమన కరుణాకరరెడ్డికి మళ్లీ టీటీడీ చైర్మన్ పదవి వరించింది,