కొవిడ్ సర్టిఫికెట్ ఉంటేనే శ్రీవారి దర్శనం

V6 Velugu Posted on Sep 24, 2021

తిరుపతి: తిరుమల వెంకన్నను దర్శించుకోవాలంటే కోవిడ్ సర్టిఫికేట్ తప్పనిసరి చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. భక్తుల రద్దీ, డిమాండ్ దృష్ట్యా టీటీడీ ఆఫ్‎లైన్ దర్శన టికెట్లను గురువారంతో రద్దుచేసింది. ఆఫ్‎లైన్‎కు బదులుగా ఆన్‎లైన్‎లో సర్వదర్శనం టికెట్లు విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో అక్టోబర్ నెలకి సంబంధించి రోజుకి 8 వేల టికెట్ల చొప్పున ఈ నెల 25 ఉదయం 9 గంటల నుంచి ఆన్‎లైన్‎లో అందుబాటులోకి రానున్నాయి. అదేవిధంగా రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు కూడా ఆన్‎లైన్‎లో అందుబాటులోకి రానున్నాయి. కాగా.. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపింది. రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్ లేదా మూడు రోజుల ముందు తీసుకున్న కోవిడ్ నెగిటివ్ సర్టిఫికేట్ ఉంటేనే దర్శనానికి అనుమతిస్తామని టీటీడీ తెలిపింది.

ఇదిలా ఉంటే.. సర్వదర్శనం టోకెన్లు నిలిపివేయడంతో భక్తులు ఆందోళనకు దిగారు. శ్రీనివాసంలో నిన్నటి నుంచి ఉచిత దర్శనం టోకెట్ల జారీని టీటీడీ నిలిపివేసింది. విషయం తెలియక తిరుపతికి చేరుకున్న భక్తులు.. శ్రీనివాసం దగ్గర టోకెన్లు ఇవ్వకపోవడంతో అధికారులతో వాగ్వాదానికి దిగారు. తిరుపతి బస్టాండ్ ఎదురుగా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సర్వదర్శనం టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భక్తులు రోడ్డుపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

For More News..

ప్రారంభమై.. వాయిదా పడిన అసెంబ్లీ సమావేశాలు

Tagged tirumala, Tirupati, TTD, andhrapradesh, corona virus, online tickets, Covid Certificate, sarva darshanam

Latest Videos

Subscribe Now

More News