ప్రారంభమై.. వాయిదా పడిన అసెంబ్లీ సమావేశాలు 

ప్రారంభమై.. వాయిదా పడిన అసెంబ్లీ సమావేశాలు 

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తన ప్రసంగంతో సమావేశాలను మొదలుపెట్టారు. ఈ మధ్య కాలంలో చనిపోయిన 8 మంది మాజీ శాసనసభ్యులకు సంతాపం తెలిపారు. అనంతరం సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

భద్రాచలం జిల్లా బూర్గంపాడు మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం మృతికి సంతాపం ప్రకటించారు. కుంజా భిక్షం ఏప్రిల్ 24, 2021న మరణించారు.

ములుగు మాజీ ఎమ్మెల్యే చందూలాల్ మృతికి సంతాపం తెలిపారు. చందూలాల్ రెండుసార్లు లోకసభకు కూడా ప్రాతినిధ్యం వహించారు. చందూలాల్ ఏప్రిల్ 15, 2021న మరణించారు.

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మాజీ శాసనసభ్యులు కేతిరి సాయిరెడ్డి మృతిపట్ల సభ తీవ్ర సంతాపం తెలియజేసింది. సాయిరెడ్డి ఏప్రిల్ 23, 2021న మరణించారు.

కరీంనగర్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మేనేని సత్యనారాయణ మృతిపట్ల సభ తీవ్ర సంతాపం తెలియజేసింది. సత్యనారాయణ ఏప్రిల్ 27, 2021న మృతిచెందారు.

వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మాచర్ల జగన్నాథం మృతిపట్ల సభ తీవ్ర సంతాపం తెలియజేసింది. జగన్నాథం ఏప్రిల్ 30, 2021న మృతిచెందారు.

మెదక్ జిల్లా రామాయంపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు రాజయ్యగారి ముత్యంరెడ్డి మృతిపట్ల సభ తీవ్ర సంతాపం తెలియజేసింది. ముత్యంరెడ్డి మే 3, 2021న మృతిచెందారు.

భద్రాద్రి జిల్లా సుజాత నగర్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బొగ్గారం సీతారామయ్య మృతిపట్ల సభ తీవ్ర సంతాపం తెలియజేసింది. సీతారామయ్య మే 7, 2021న మృతిచెందారు.

భద్రాద్రి జిల్లా కొత్తగూడెం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు చేకూరి కాశయ్య మృతిపట్ల సభ తీవ్ర సంతాపం తెలియజేసింది. కాశయ్య మే 25, 2021న మృతిచెందారు.