
మాదేనన్న టీటీడీ.. మూడేళ్ల క్రితం బ్యాంకులో పెట్టామని వెల్లడి
తిరుమల, వెలుగు: ఒకటా రెండా .. 1381 కిలోల బంగారం! మంచిగా ప్యాక్ చేసి తరలిస్తున్నారు! తమిళనాడులోని తిరువల్లూర్ జిల్లా, వేపమ్ బట్టుటోల్ ప్లాజా దగ్గరకు ఆ వాహనం చేరుకోగానే.. ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేసిం ది. ఆరా తీస్తే..తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బంగారమని ఆ వాహన డ్రైవర్లు చెప్పా రు. సరైన పత్రాలు లేకపోవడంతో పూందమల్లి తహశీల్దార్ ఆఫీసుకు ఆ వాహనాన్ని , బంగారాన్ని తీసుకెళ్లి విచారిం చారు. అయితే, ఆ బంగారం తమదేనని టీటీడీ అధికారులతో పాటు తిరువల్లూ రు ఎస్పీ ధ్రువీకరించారు. మూడేళ్ల క్రితం చెన్నైలోని పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఆ బంగారాన్ని దాచినట్టు టీటీడీ అధికారులు చెబుతున్నారు.టైం అయిపోవడంతో బంగారాన్ని అప్పగించాల్సిం-దిగా బ్యాంకుకు లేఖ రాశామని టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ చెప్పా రు. బంగారం తరలిం పుకు సంబంధించి న లేఖ పంజాబ్ నేషనల్ బ్యాంక్ తిరుపతి బ్రాంచి అధికారుల వద్ద ఉన్నట్టు తెలిపారు.