జులై 9న సమ్మెను విజయవంతం చేయాలి : ఎం.ముత్తన్న

జులై 9న సమ్మెను విజయవంతం చేయాలి : ఎం.ముత్తన్న

ఆర్మూర్​, వెలుగు: ఈ నెల 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయూసీఐ) రాష్ట్ర కార్యదర్శి ఎం.ముత్తన్న పిలుపునిచ్చారు. ఆదివారం ఆర్మూర్​లోని కుమార్ నారాయణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాల్లో మోదీ ప్రభుత్వం కార్మిక చట్టాలను నాలుగు కోడ్స్ గా తీసుకొచ్చి కార్మికులను అన్యాయం చేసిందన్నారు. కార్మికుల డిమాండ్స్ సాధన కోసం సమ్మె చేపడుతున్నామన్నారు. టీయూసీఐ నాయకులు కె. రాజేశ్వర్, నిమ్మల నిఖిల్, ఎం. లింబాద్రి పాల్గొన్నారు.

బోధన్ లో బైక్ ర్యాలీ.. 

బోధన్, వెలుగు: ఈనెల 9న సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని బోధన్ పట్టణంలోని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. బోధన్ పట్టణంలోని పాన్ గల్లి లోని హెడ్ పోస్టాఫీస్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రి, పాత బస్టాండు, అంబేద్కర్ చౌరస్తా మీదుగా, షర్బత్ కెనాల్, కొత్త బస్టాండ్, సాత్ పూల్ నుంచి శక్కర్ నగర్   చౌరస్తా , రైల్వే గేటు,  గంజ్ కమాన్,  అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా టీయూసీఐ రాష్ట్ర నాయకుడు బి. మల్లేశ్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జె.శంకర్ గౌడ్, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు పి. వరదయ్య మాట్లాడారు. 

డీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు అనుకూల విధానాలను అనుసరిస్తూ,  కార్మికులకు నష్టం కలిగిస్తుందన్నారు. ఢిల్లీలో రైతాంగం సంవత్సరానికిపైగా పోరాడితే వారికి ఇచ్చిన హామీలను  అమలు చేయడం లేదని మండిపడ్డారు. కార్యక్రమంలో జి.సీతారాం, డి.పోశెట్టి, డి.నాగేశ్​, బి.భూషణ్ గౌడ్, సీహెచ్ నాగయ్య, ప్రభాస్, గంగాధర్, ఎస్.సాయిలు, రాములు, శేఖర్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.