సీఎం కేసీఆర్ మాట తప్పారు..తుడుం దెబ్బ నేతల నిరసన

సీఎం కేసీఆర్ మాట తప్పారు..తుడుం దెబ్బ నేతల నిరసన

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ నేతలు నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీలు–ఫారెస్ట్ అధికారుల మధ్య ఘర్షణ వాతావరణం సృష్టిస్తోందని ఆరోపించారు. చండ్రుగొండ అటవీశాఖ రేంజ్ అధికారి శ్రీనివాస్ రావు హత్య ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వం చేసిన హత్యేనని ఆరోపించారు. పోడు భూములకు పట్టాలిస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోడు భూముల సమస్యను కుర్చీ వేసుకుని పరిష్కరిస్తానన్న సీఎం కేసీఆర్.. ఏళ్లుగా నాన్చటంతో రోజూ ఏదో ఒక చోట ఫారెస్ట్ అధికారులు, పోడు రైతులకు మధ్య గొడవలు జరుగుతున్నాయని చెప్పారు. పోడు సమస్య పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే FRO శ్రీనివాసరావు చనిపోయారన్నారు.