- పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు
పాల్వంచ, వెలుగు : మండలంలోని కేపీ జగన్నాథపురంలో ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలోని అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయంలో కార్తీకమాసం ద్వాదశ తిధినిపురస్కరించుకొని తులసీ ధాత్రి కల్యాణాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. అంతకుముందు ఉత్సవ మూర్తులను మేళతాళాల నడుమ మండపానికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృ తాలతో అభిషేకం నిర్వహించి లక్షబిల్వర్చన, హారతులు నివేదన పూజలు నిర్వ హించారు.
ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సామూహిక కుంకుమార్చన పూజలకు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం ఆకాశదీపం లక్ష దీపోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో అన్నప్రాసనలు, వాహన పూజలు, తల నీలాలు, అమ్మ వారికి ఒడిబియ్యం, చీరలు, కనుమలు తదితర మొక్కులను భక్తులు చెల్లించుకున్నారు. ఈ పూజల్లో ఈవో రజనీకుమారి, ధర్మ కర్తల మండలి చైర్మన్ బా లినేని నాగేశ్వరరావు, ధర్మకర్తలు పెండ్లి రామిరెడ్డి, చెవుగాని పాపా రావు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
